జగిత్యాలలో ఆలయాలకు శ్రావణ శుక్రవారం శోభ

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ఆలయాలకు (Jagtial Temples) శ్రావణ మాసం శుక్రవారం శోభా సంతరించుకుంది. జగిత్యాల పట్టణ చింతకుంటలోని శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శ్రావణ మాసం శుక్రవారం పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, పాలభిషేకం లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేశారు.

పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వార ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. అలాగే అమ్మ వారి శేష వస్త్రం, అమ్మ వారి ప్రసాదం తాంబూలం ఆలయ పూజారి ఆశీర్వచనములతో బహుకరించారు. తదనంరం అమ్మ వారికి ముడుపులు కట్టారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని 108 శ్రీ చక్ర సహిత లలితమాత ఆలయంలో ఫౌండర్ చైర్మన్ చెల్లం స్వరూప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమ పూజలు చేశారు.

మాణిద్విప వర్ణన, లలితసహస్రనామా పారాయణం గావించి శ్రీచక్రాలకు కుంకుమ పూజలు చేసి, అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ రమేశ్, చంధ్రారెడ్డి, సత్తయ్యా, మహేందర్, ఊటూరి అర్చన, ఊటూరి కళ్యాణి, ఎన్నం మంజుల, లక్ష్మి, డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వొడ్నాల శ్రీనివాస్, వొడ్నాల లత, వడ్ల గట్ట స్వాతి, సుజాత, అంజలి, వనజ, హర్షిణి, ప్రసన్న, కావ్య, మాధురి, శిరిష, తార, సంధ్య, అనురాధ, గంగమ్మ అర్చకులు శ్రీహరి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>