ఆర్ట్స్ జూనియర్ కాలేజీలో ఫ్రెష‌ర్స్ డే

క‌లం, క‌రీంన‌గ‌ర్‌: క‌రీంన‌గ‌ర్‌ (Karimnagar)లోని ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాల (Arts Junior College)లో నూతనంగా చేరిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, కళాశాల ప్రిన్సిపాల్ సత్య వర్ధన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ.. నూతన విద్యార్థులు కళాశాల వాతావరణానికి అలవాటు పడుతూ, విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచిస్తూ ప్రభుత్వం ద్వారా అందించిన ఉచిత నోట్ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.

కార్యక్రమంలో విద్యార్థుల పాటలు, నృత్యాలు, వినోద కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం నూతన విద్యార్థులను సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులు ఆత్మీయంగా స్వాగతించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పద్మ, సూపరిండెంట్ బల్బీర్ సింగ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>