తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో సినిమా..!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్‌లో తెలంగాణ నేప‌థ్యంలో మ‌రో సినిమా తెర‌కెక్కుతోంది. శ‌నార్తి (Shanarthi) అనే అచ్చ‌మైన తెలంగాణ ప‌దం టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు గణేశ్‌ రాజ్‌ ఉప్పునూతి దర్శకత్వం వ‌హిస్తున్నారు. డైరెక్ట‌ర్‌ సంపత్‌ నంది, కేవీ శ్రీధర్‌ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్ర‌ముఖ ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్‌ నాగ‌దుర్గ‌ (Naga Durga), రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ (Akhil Raj) జోడీగా న‌టిస్తున్నారు. శుక్ర‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. హీరోహీరోయిన్లు కంక‌ణాలు క‌ట్టుకొని ప‌సుపు, కుంకుమ అద్దుకున్న చేతుల‌తో ఉన్న ఈ పోస్ట‌ర్‌ను రూపొందించారు. శ‌నార్తి.. ఏ టేల్ ఆఫ్ క‌ల్చ‌ర్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. పోస్ట‌ర్‌తోనే సినిమాపై మంచి పాజిటివ్ బ‌జ్ క్రియేట్ చేశారు.

కొన్నేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో ఫేమ‌స్ అయిన నాగ‌దుర్గ‌కు తాజాగా వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆమె సినిమాలు చేస్తున్నారు. తమిళంలో ఇప్ప‌టికే లవ్‌ ఓ లవ్‌ సినిమాతో నాగ‌దుర్గ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చేసింది. మ‌రోవైపు సుకుమార్‌, బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ‘ఇడుపుకాయితం’లో ప్రియదర్శికి జోడీగా న‌టిస్తోంది. ఇడుపుకాగితం పేరు అనౌన్స్ చేసిన‌ప్పుడే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక‌ముందే నాగ‌దుర్గ శ‌నార్తి సినిమాను లైన్‌లో పెట్టేసింది. ఇక అఖిల్ రాజ్ కూడా రాజు వెడ్స్ రాంబాయితో తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తాజాగా అనుప‌మ‌తో మ‌రో సినిమాలో న‌టించాడు. ఇద్ద‌రూ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లే కావ‌డంతో శ‌నార్తి వీరికి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>