కలం, వెబ్ డెస్క్: ఇటీవల సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను అభివృద్ది కోసమే పార్టీ మారానని, అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరువలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పోచారంతో పాటు కొంతమంది నేతలు కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేశాయి.
ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సైతం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 10 కోట్ల నిధులు కూడా తన నియోజకవర్గానికి రాబట్టలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఆయన పార్టీకి అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లేక్ వ్యూ పార్కు సమీపంలో పూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ‘‘ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల.. అంటూ ఎమ్మెల్యే దానం స్పీచ్ ఇవ్వడం కొందరికి షాక్ ఇవ్వగా, మరికొందరికి నవ్వులు తెప్పించింది.
ఈ క్రమంలో సభికులు కరతాళ ధ్వనులు చేయడంతో సభ మార్మోగింది. దీంతో సీఎం రేవంత్ సైతం ముసి ముసి నవ్వులు నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానం నాగేందర్ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పేరు తప్పుగా పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
-ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టంగ్ స్లిప్
-ముఖ్యమంత్రి “కల్వకుంట్ల” అంటూ స్పీచ్
-ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
MLA Danam Nagender’s ‘Kalvakuntla’ Tongue Slip Sparks Political Debate#DanamNagender #KCR #TelanganaCM #RevanthReddy #Congress #BRS… pic.twitter.com/YrtRWlu7NT— Kalam Daily (@kalamtelugu) August 14, 2026
Also Read : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కీలక ప్రకటన!
Follow Us On: Instagram

