కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు చేతిలో తుపాకులు పట్టుకుని, అడవుల్లో భయానక వాతావరణంలో బతికిన మాజీ నక్సల్స్ ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి సరికొత్త జీవనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఏకంగా ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మాజీ నక్సల్స్ చేసిన ర్యాంప్ వాక్ చేసి (Maoists Fashion Show) ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా రాయ్‌పూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ నక్సల్స్ పాల్గొన్నారు. మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌వాక్ (Maoists Fashion Show) చేశారు. ఈ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్న వారి కాన్ఫిడెన్స్, స్టైల్, లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ర్యాంప్‌పై మెరిసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి ర్యాంప్‌వాక్ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వారి స్టైల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఈ వీడియోను నెట్టింట విస్త్రృతంగా షేర్ చేస్తూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తున్నారు.
”కాంగ్రెస్ 60 ఏళ్లలో సాధించలేనిదాన్ని బీజేపీ కేవలం 11 ఏళ్లలో సాధించింది” అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి, అమిత్ షా కు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నక్సలిజం వ్యతిరేక విధానంపై చర్చ జరుగుతున్న వేళ ఇటీవల జరిగిన నక్సల్స్ ర్యాంప్ వాక్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : పంద్రాగస్టుకూ పాత యూనిఫాంలేనా?
Follow Us On : WhatsApp

