కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే కబ్జా, దోపిడికి మారుపేరుగా మారిందని ఆయన విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాల హయాంలో లేని 22A నిబంధనలు ఇప్పుడు ఉన్నపళంగా ఎలా అమల్లోకి వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బొంబాయి మార్గంలో లేదా బొంరాస్‌పేట్‌లో 1000 ఎకరాల విలువైన భూమిని ఎవరి పేరు మీదికి మార్చుతున్నారో, ఆ భూములు ఎక్కడికి మాయమైపోతున్నాయో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఏమైనా చేతబడి చేసి అంత భూమిని మాయం చేశారా అని తీవ్రంగా ఆక్షేపించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే అందించిన పాస్‌బుక్కులను ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు మారుస్తున్నారో ప్రజలకు వివరించాలని అడిగారు. ఎవరి స్వలాభం కోసం, ఎవరి దోపిడీ కోసం ఈ మార్పులు చేస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలని మల్లారెడ్డి (Malla Reddy) ప్రభుత్వాన్ని నిలదీశారు.
Also Read : మోదీ ఫొటో పెట్టకపోతే.. బీజేపీ ఎంపీల వార్నింగ్
Follow Us On: X(Twitter)

