కలం, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించేందుకు ఓ వ్యక్తి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం భద్రతా సిబ్బంది ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేస్తుండగా సదరు వ్యక్తి లగేజీలో ఓ అనుమానాస్పద వస్తువు కనిపించింది.
దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ బ్యాగ్‌ను తెరిచి పరిశీలించగా అందులో పుర్రెను చూసి షాకయ్యారు. దీనిపై అధికారులు ఆరా తీయగా అది కోతి పుర్రె (Monkey Skull) అని ఆ ప్రయాణికుడు అంగీకరించాడు. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

