గుకేష్‌ ఆ మాయ నుంచి బయటపడాలి: నకముర

కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అమెరికన్ గ్రాండ్‌ మాస్టర్ హిక్కారూ నకముర (Hikaru Nakamura) అన్నారు. టైటిల్ నిలబెట్టుకోవాలంటే ఆయన చుట్టూ ఉన్న అనవసర విషయాలను పక్కన పెట్టాలని సూచించారు. 2024లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేష్ వరుసగా విఫలమవుతున్నారు. నార్వే చెస్, చెన్నై, టాటా స్టీల్, ప్రాగ్ మాస్టర్స్ టోర్నీల్లో ఆయన నిరాశపరిచారు. ఆగస్టు 2026 నాటికి గుకేష్ ఎఫ్ఐడీఈ (FIDE) రేటింగ్ 2703కు పడిపోయింది. మాగ్నస్ కార్ల్‌సన్‌తో పోల్చుకోవద్దని, గెలుపు కోసమే కాకుండా డ్రాల కోసమైనా ఆడాలని గుకేష్‌కు నకముర సూచించారు.

గుకేష్ మళ్లీ కంబ్యాక్..

రాబోయే టైటిల్ డిఫెన్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ జవోఖిర్ సిందరోవ్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నకముర అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ గుకేష్ కం బ్యాక్ ఇస్తారని నకముర ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే భారత్‌లో విశ్వనాథన్ ఆనంద్ చెస్ రంగానికి గాడ్‌ఫాదర్ అని కొనియాడారు. ఆనంద్ అందించిన స్ఫూర్తితోనే ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి, నిహాల్ సరీన్, గుకేష్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారని ప్రశంసించారు.

భారత్‌లో చెస్ భవిష్యత్తు సూపర్..

రాబోయే కాలంలో భారత్‌లో చెస్ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పారు. మరోవైపు తన కెరీర్‌పై కూడా నకముర స్పష్టత ఇచ్చారు. 2028 చెస్ ఒలింపియాడ్ టోర్నీ తనకు చివరి క్లాసికల్ చెస్ టోర్నమెంట్ కానుందని నకముర వెల్లడించారు. తక్కువ సమయం ఉండే మ్యాచ్‌లను క్లాసికల్ చెస్‌గా పరిగణించడాన్ని ఆయన తప్పుపట్టారు. అదే సమయంలో ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్‌లో చెస్‌ను చేర్చడంపై నకముర హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>