భువనగిరిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్ తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి (Bhuvanagiri) రైల్వే స్టేషన్ నుండి వినాయక చౌరస్తా వరకు జాతీయ పతాకాలతో విద్యార్థులు యువకులు స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడారు.

దేశ స్వాతంత్య్రన్ని సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. “నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగుతూ భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మీ వంతు పాత్ర పోషించాలి” అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఊట్కూర్ అశోక్ గౌడ్, హర్ ఘర్ తిరంగా కో – కన్వీనర్ పట్నం కపిల్, బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పాశం భాస్కర్, మాయ దశరథ, తుమ్మల మురళీధర్ రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వరరావు, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేందర్, కొప్పుల యాదిరెడ్డి, కదూరి అచ్చయ్య, జైనపల్లి శ్యామ్ సుందర్, పట్నం శ్రీనివాస్, గూడూరు నారోత్తం రెడ్డి, తిరంగ్ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ నిజ‌మైన సెక్యుల‌ర్ పార్టీ: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>