SIR పేరుతో మెసేజ్‌లు.. ఎన్నికల కమిషన్ హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : ఎన్నికల కమిషన్ పేరుతో వచ్చే మెసేజ్ లు, ఫేక్ కాల్స్ పై జాగ్రత్తగా ఉండాలని ఓటర్లకు తెలంగాణ ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) కీలక సూచనలు చేశారు. ఎన్యూమరేషన్ ఫారమ్ ప్రక్రియలో తప్పులు ఉన్నాయని సైబర్ నేరగాళ్లు ఓట్లర్లకు ఎస్ఎంఎస్ లు పంపుతున్నారని తెలిపారు. సమాచారం సరిపోవడం లేదని.. ప్రక్రియను పూర్తి చేసేందుకు ఐదు రుపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

దీని కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో పాటు నెట బ్యాంకింగ్ వివరాలు పంపించాలని కోరుతున్నారని చెప్పారు. అలాగే, సర్ ఓటర్ ఫారమ్ రిజెక్ట్ అయిందని, ఫారమ్ పూర్తి చేయాలని లింకులు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్త వహించాలని సీఈవో (CEO Sudarshan Reddy) సూచించారు. మోసగాళ్ల మాటలు నమ్మి వ్యక్తిగత వివరాలు పంపిస్తే ఆర్థిక చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎన్నికల సంఘం పేరుతో వచ్చే మెసేజ్ లు లేదా లింకుల్లో ఎలాంటి వివరాలు అడగరని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ, ఎన్నికల కమిషన్ పేరుతో ఫేక్ కాల్స్, మెసేజ్ లు వస్తే వాటికి స్పందించకుండా సమీప పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాలని సీఈసీ కోరారు.

Also Read : ఆ తీర్పు చాలా బాధాకరం: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>