బాసర ఆర్జీయూకేటీ విద్యా వారోత్సవానికి ప్రపంచస్థాయి గుర్తింపు

కలం, నిర్మల్: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT Basar)లో నిర్వహించిన విద్యా వారోత్సవానికి (Education Week) అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మే 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ వారోత్సవంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, విద్యార్థుల సంక్షేమంపై పలు కార్యక్రమాలు చేపట్టారు. ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు యోగా, ఆరోగ్య పరీక్షలు, డిజిటల్ అక్షరాస్యత, వర్క్‌షాప్‌లు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలు ఫోర్బ్స్ ప్రపంచ రికార్డుల పుస్తకంలో స్థానం సంపాదించడంతో పాటు ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవరాజు పర్యవేక్షణలో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచస్థాయి గుర్తింపు విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>