కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని పాతబస్తీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగి దొంగతానికి వచ్చిన ఓ యువకుడు (Drunk Thief) ఇంట్లోనే నిద్రపోయాడు. ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువుల కోసం ఇల్లంతా వెతికి అలసిపోవడంతో బెడ్రూమ్ లోనే గురకపెట్టి హాయిగా పడుకున్నాడు. తెల్లారేసరికి అలాగే పడుకోవడంతో దొరికిపోయాడు.
ఉదయం ఇంటి యజమాని తలుపులు తీసి లోపలికి రాగానే ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను చూసిన నెటిజన్లు పాపం లేత దొంగ ఏమో.. ఇంకా దొంగతనం చేయడంలో అనుభవం రాలేదేమోనని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే, మద్యం మత్తు ఎక్కువ కావడంతో బెడ్రూమ్‌లోనే పడుకుని గురకపెట్టి నిద్రపోయాడు. ఉదయం ఇంటి యజమాని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read : SIR పేరుతో మెసేజ్‌లు.. ఎన్నికల కమిషన్ హెచ్చరిక
Follow Us On : WhatsApp

