నిద్రమాత్రలతో మత్తెక్కించి.. భర్తను అతికిరాతకంగా హత్య చేసిన భార్య..?

కలం, వెబ్ డెస్క్ : ప్రియుడిపై ప్రేమతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిందో భార్య (Wife Kills Husband). అన్నంలో నిద్ర మాత్రలు కలిపి నిద్రపోయిన తరువాత ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పీలేరు డిష్ కాలనీలో మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం, ఉమాదేవి(42) భార్యాభర్తలు నివసిస్తున్నారు.

అయితే, ఉమాదేవీ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం (32) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసుగుచెందిన ఉమాదేవీ భర్తను కడ తేర్చాలని నిర్ణయించుకుంది. విషయం ప్రియుడితో చెప్పి హత్యకు ప్లాన్ చేశారు.

ఈ నెల 8వ తేదీన రాత్రి భర్త సుబ్రహ్మణ్యం తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపారు. అనంతరం ప్రియుడితో కలిసి ఇనుపరాడ్డు, గుండ్రాయితో భర్త తల పగలగొట్టి చంపేశారు. అనుమానం రాకుండా అర్ధరాత్రి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి మదనపల్లె – తిరుపతి రహదారిపై పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్లాన్ చేశారు.

అనుమానం వచ్చిన సుబ్రమహ్మణ్యం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి భార్య ఉమాదేవిని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడితో కలిసి తానే హత్య చేశానని ఉమాదేవి ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>