epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అమెరికాలో తెలుగు వ్యక్తి స్టార్టప్​కు బెదిరింపులు

కలం, వెబ్​డెస్క్​: అమెరికాలో తెలుగు వ్యక్తి స్థాపించిన గిగా ఏఐ స్టార్టప్​ (Giga AI Startup) కు బెదిరింపులు ఎదురయ్యాయి. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే స్టార్టప్​లోని డేటాను బయటపెట్టేస్తామని మెయిల్​ ద్వారా బెదిరింపు లేఖ వచ్చినట్లు ‘గిగా’ స్టార్టప్​ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈవో వరుణ్​ ఉమ్మడి(Varun Vummadi) ‘ఎక్స్​’ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు బెదిరింపు మెయిల్​ స్క్రీన్​షాట్​ను ట్వీట్​కు జత చేశారు. కొంతకాలంగా కొందరు వ్యక్తులు తన కంపెనీని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని వరుణ్​ తెలిపారు.

గుర్తు తెలియని క్రిప్టో అకౌంట్​కు 3 మిలియన్​ డాలర్లు పంపాలని, లేకపోతే కంపెనీలోని కీలకమైన సమాచారాన్ని బయటపెడతామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కంపెనీలో పనిచేసిన కొంతమంది వ్యక్తులే దీని వెనక ఉన్నట్లు ఆరోపించారు. కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇప్పటికే సోషల్​ మీడియా ద్వారా దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, తాము చూస్తూ ఊరుకోబోమని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చట్టం, న్యాయం పరంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు.

కాగా, జారెడ్​ స్టీల్​ అనే మాజీ ఉద్యోగి ఇటీవల గిగా (Giga AI Startup) పై అనేక ఆరోపణలు చేశారు. వర్క్​ ఎన్విరాన్​మెంట్​, వర్క్​–లైఫ్​ బ్యాలెన్స్​ సరిగా ఉండవని, రోజుకు 12 గంటలు పనిచేయిస్తారని, చెప్పిన శాలరీలు ఇవ్వరని ఆరోపించాడు. అయితే, అతను కేవలం ఒక్కరోజు మాత్రమే ‘గిగా’లో పనిచేయడం గమనార్హం. కాగా, జారెడ్​ ఆరోపణలను ఇప్పటికే వరుణ్​ ఖండించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ వరుణ్​ ఉమ్మడి సొంతూరు. ఐఐటీ ఖరగపూర్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశారు. అమెరికాలోని స్టాన్​ఫోర్డ్​ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. అక్కడే ఏడాదికి రూ.4.3కోట్ల జీతం వచ్చే ఉద్యోగం కాదనుకొని, రెండేళ్ల కిందట ‘గిగా’ ఏఐ స్టార్టప్​ స్థాపించాడు. ఏడాదిలోనే కంపెనీకి రూ.540కోట్ల పెట్టుబడుడులు వచ్చాయి. ఇటీవల సిరీస్ ఏ ఫండింగ్​లో మరో 61 మిలియన్ల డాలర్ల ఫండింగ్​ పొందాడు. ప్రస్తుతం గిగా చాలా పెద్ద కంపెనీలకు ఏఐ సేవలు అందిస్తోంది.

Read Also: బంగ్లా హింసపై అసదుద్దీన్ స్పందన.. ఏమన్నారంటే !

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>