కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao) అరెస్ట్ అయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న రేగాను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలుసార్లు బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని రేగా కాంతారావు ఆశ్రయించాగా మంజూరుకు హైకోర్టు నిరాకరించింది.
కాగా, రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను శారీరకంగా వాడుకుని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 26వ తేదీన పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

