రేపు నల్లగొండకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక.. కీలక అంశాలపై చర్చ

కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC ST Commission) బుధవారం నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrashekar) ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుష్రుమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ ఈ సమీక్షలో పాల్గొంటారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భూ సమస్యల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు – చట్టపరమైన చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ల పక్కా అమలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రగతి అంశాలపై సమీక్షించనున్నారు. ఈ ప్రాధాన్యత కలిగిన సమీక్షా సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డీసీఓలు, ఆర్‌సీఓలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>