కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ నిబంధనల్లో మార్పులు (YouTube Monetization Rules) చేసింది. మానిటైజింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. క్రియేటర్లు మానిటైజేషన్ పొందడానికి వాచ్ టైమ్, వ్యూస్ అర్హతలను పెంచింది.
కొత్త ఛానెల్ లకు లాంగ్ ఫార్మ్ వీడియోలకు 12నెల్లల్లో 4000 గంటల నుంచి 8000 గంటలకు పెంచింది. షార్ట్ వీడియోలకు గతంలో 10 మిలియన్ల వ్యూస్ రావాల్సి ఉండగా దాన్ని రెండింతలు చేసింది. 90 రోజుల్లో 20 మిలియన్ల వ్యూస్ రావాలని స్పష్టం చేసింది.
దీంతో పాటు ఏఐ, కాపీ కంటెంట్, రిపీటేటివ్ కంటెంట్ పై ఆంక్షలను యూట్యూబ్ కఠినతరం చేసింది. ప్లాట్ ఫామ్ పై స్పామ్ తగ్గించడానికి సోషల్ మీడియా దిగ్గజం మానిటైజింగ్ పాలసీలో మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ నిబంధనలు 2027 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ఆంక్షలతో కొత్తగా వచ్చే యూట్యూబ్ క్రియేటర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

