హీరో యశ్ కోసం ఆ రూల్‌ను బ్రేక్ చేసిన నయనతార

కలం, వెబ్ డెస్క్: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార (Nayanthara). ఒకవైపు కుర్ర హీరోయిన్స్‌, మరోవైపు స్టార్ హీరోలకు పోటీనిస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు. వయసు పెరుగుతున్నా.. తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటుపోతున్నారు. అయితే ఎంతటి స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పటికీ, ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండటమనే కఠినమైన రూమ్‌ను ఆమె ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నారు. చిరంజీవి, రజనీకాంత్ లాంటి దిగ్గజ నటుల సరసన నటించినా సరే ఆమె ఈ నియమాన్ని పక్కన పెట్టారు. మన శంకర వర ప్రసాద్ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్నా.. తన పాత్ర పరిచయం వరకు మాత్రమే పరిమితమయ్యారు.

అయితే రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ సినిమా కోసం నయనతార తన రూల్‌ను పక్కన పెట్టారు. ఇటీవల జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. తాను సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉంటానని, కానీ హీరో యశ్ టాక్సిక్ మూవీ కోసం ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు.

ఇదే వేదికపై యశ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన నయన్, ఆయనను రియల్ స్టార్ అంటూ కొనియాడారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. కెరీర్‌లో మొదటిసారి తన సొంత నియమాలను బ్రేక్ చేయడంతో నయనతార (Nayanthara) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు.

Also Read : ఏఆర్ రెహమాన్ తనయుడికి తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>