పునర్వసు నక్షత్ర వేళ.. ఖిల్లా రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఖిల్లా శ్రీ రఘునాథ ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. సామూహికంగా 60 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. అతి ప్రాచీన ఆలయం అభివృద్ధికి నగర ప్రజలు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణంను నాని పంతులు, సందీప్ తివారి, నారాయణ, సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆలయ ట్రస్టు చైర్మన్ గురు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు ముక్క దేవేందర్ గుప్తా , జీ. ఆర్. ఎంటర్ ప్రైజెస్ అధినేత రాజశేఖర్ గుప్త, ఎర్రం పూర్ణచందర్, ఎర్రంప్రభాకర్, అశోక్, తాటి వీరేశం, పెంటయ్య, పోలా వీరేందర్, గజవాడ ధర్మరాజు, మాజీ కౌన్సిలర్ అంబదాస్, రాఘవులు, హన్మండ్లు, సంజీవరావు, గంగాధర్, ప్రవీణ్, డాక్టర్ ముక్క వినోద్ కుమార్ గుప్తా, గాలి నాగరాజు, డాక్టర్ వాణి, ధన్పాల్ నారాయణ, పెండ్యాల శ్రీనివాస్, వాసు తదితర దంపతులు ఈ కల్యాణంలో పాల్గొన్నారు. పుర ప్రముఖులు రాజ్ కుమార్ సుబేదార్, మీసాల శ్రీనివాసరావు, కొండ వీర శేఖర్, గుడిపల్లి రమేష్, కోవూరి జగన్, పడిగెల నాగనాథ్, కూతురు అశోక్ కుమార్, సంతోష్, కశ్యపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కల్యాణానికి మంచి స్పందన లభించిందని తాటి వీరేశం తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రాచుర్యానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

Also Read : టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభకు ముహూర్తం ఫిక్స్ !

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>