కలం, వెబ్ డెస్క్: జూన్ నెలలో నిర్వహించిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఈ వారంలోనే విడుదలవుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అదే సమయంలో సీఎస్ఐఆర్–నెట్, ఐకార్ ఏఐఈఈఏ (పీజీ), ఏఐసీఈ (పీహెచ్.డీ) పరీక్షల ఆన్సర్ కీ లను కూడా ఈ వారంలోనే అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వివరించింది. ఆన్సర్ కీ విడుదల సమయంలోనే.. అభ్యంతరాలు ఎలా నమోదు చేయాలనే అంశానికి సంబంధించి స్పష్టమైన సూచనలు ఇస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్, అధికారిక ప్రకటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
40 రోజుల తరువాత..
పీజీ పూర్తి చేసినవారికి 87 సబ్జెక్టుల్లో జూన్ 22–30వ తేదీల మధ్య ఎన్టీఏ నెట్ (UGC NET) పరీక్షలు నిర్వహించింది. ఇందులో క్వాలిఫై అయినవారిని జూనియర్ రీసెర్చ్ ఫెలోగా ఎంపికవుతారు. వారే ఏ యూనివర్సిటీలోనైనా పీహెచ్.డీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, పరిశోధనలు నిర్వహించుకునేందుకు అయిదేళ్ల పాటు నెలకు రూ.50 వేల చొప్పున ఫెలోషిప్ అందిస్తుంటారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి 40 రోజుల తరువాత ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేయబోతుండటం గమనార్హం. ఇంత సమయం తీసుకోవడం ఇటీవల సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.
Also Read : పొంగులేటి Vs కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో వాగ్వాదం
Follow Us On: Instagram

