కలం, నిర్మల్: బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎదిగినప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం (BC Association) జిల్లా అధ్యక్షులు డాక్టర్ కృష్ణంరాజు అన్నారు.
సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బీసీ సంఘ భవనంలో ఇటీవల గండి రామన్న దత్త సాయి ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన కొట్టే శేఖర్‌ను, డాక్టరేట్ పొందిన జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ కత్రోజు అశోక్ చారిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ చందుల ఉషన్న, కో కన్వీనర్లు సిరికొండ రమేష్, జింక లక్ష్మీనారాయణ, పండరినాథ్, కార్యనిర్వాహక అధ్యక్షులు మరికంటి జీవన్, అసోసియేట్ అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్, అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : పొంగులేటి Vs కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో వాగ్వాదం
Follow Us On: Instagram

