తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. హరీశ్ రావు లేఖ

కలం, వెబ్ డెస్క్: సాగు నీరు లేక తెలంగాణ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) మోటార్లు ఆన్ చేసి రైతులను నీళ్లు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని కోరారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఒక వైపు ఎల్‌నినో వల్ల తక్కువ వర్షభావం, మరో వైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేక రైతులు (Telangana Farmers) ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. వర్షాకాలం పంట సాగుకు నీళ్ల కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam)కి లేఖ రాశారు. రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్ రావు (Harish Rao) చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్) రిజర్వాయర్ లను నింపి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల కోసం మిడ్ మానేరు నుండి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని కోరారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని చేయాలని విన్నవించారు.

Also Read : లోక్‌స‌భ‌లో మూడు కీల‌క బిల్లులు ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>