కలం, ఖమ్మం బ్యూరో: వైరా నియోజకవర్గంలో ఎలాంటి పదవుల కేటాయింపు జరపలేదని ఖమ్మం (Khammam) జిల్లా తెలంగాణ రక్షణ సేన స్పష్టం చేసింది. పార్టీతో అనుబంధంగా పనిచేస్తున్న జి. డేవిడ్ రాజు (జగదీశ్)ను పార్టీ నుంచి పూర్తిగా పక్కన పెడుతున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. డేవిడ్ రాజుపై వచ్చిన వివిధ ఆరోపణలపై పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించిందని తెలిపింది. ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని పేర్కొంది.
ఇకపై పార్టీకి డేవిడ్ రాజుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైరా నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడికీ అధికారిక పదవిని ఇవ్వలేదని జిల్లా నాయకత్వం పేర్కొంది.

