గాంధీ భ‌వ‌న్‌లో క్విట్ ఇండియా దినోత్స‌వం

క‌లం, వెబ్‌డెస్క్‌: గాంధీభవన్‌ (Gandhi Bhavan)లో క్విట్ ఇండియా (Quit India) దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్, అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 గాంధీ విగ్రహాల ఏర్పాటు, 150 చరఖాల ప్రదర్శనతో పాటు, గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, సిద్ధాంతాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో, పుస్తక ప్రదర్శనను నాయకులు తిలకించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>