epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీజేపీ పేదల కడుపు కొడుతోంది: ఖర్గే

కలం, వెబ్ డెస్క్: బీజేపీ పేదల కడుపు కొడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (Mallikarjun Kharge) విమర్శించారు. ఆ పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవని మండిపడ్డారు. దేశం కోసం కాంగ్రెస్ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని Mallikarjun Kharge అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్యాగాలు, పోరాటాలతో నిండి ఉందని చెప్పారు. 1885 డిసెంబర్‌ 28న ముంబైలో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగిందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఎప్పటికప్పుడు ముందుండిందని ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా పేదలు, బలహీన వర్గాలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసిందన్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పని చేశాయని చెప్పారు. దేశ అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ఎప్పటికీ నిలబడుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టేలా వ్యవహరిస్తోందని ఖర్గే విమర్శించారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడమే బీజేపీ పాలన ప్రధాన లక్ష్యంగా మారిందన్నారు.

మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలు నడుచుకోవాలని ఖర్గే పిలుపునిచ్చారు. అహింస, సత్యం, సమానత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ బలోపేతానికి కేడర్‌ కష్టపడి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ను ఎవరూ అంతం చేయలేరని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూనే దేశ భవిష్యత్తును రక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>