కలం స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్, మ్యాచ్ ఫినిషర్ టిమ్ డేవిడ్ (Tim David).. జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అతడికి గాయం కావడంతో వరల్డ్ కప్ జట్టులో అతడికి స్థానం దక్కే అవకాశాలు సన్నగిల్లాయి. బిగ్ బ్యాష్ లీగ్ మ్యాచ్‌లో టిమ్ తొడ కండరాలకు గాయమైంది.
శుక్రవారం రాత్రి పెర్త్ స్టేడియంలో హోబర్ట్ హరికేన్స్–పర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ తరఫున ఆడిన టిమ్ డేవిడ్ (Tim David) 28 బంతుల్లో 42 పరుగులతో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. రన్స్ తీసే సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే రిటైర్డ్ హర్ట్‌గా తిరిగి వెళ్లాడు.
ఇప్పటికే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, బిగ్ బాష్ లీగ్ జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో టిమ్ డేవిడ్ పూర్తిగా కోలుకోవడానికి సమయం చాలా తక్కువ. ఇది ఆస్ట్రేలియా సెలెక్టర్లలో ఆందోళన పెంచుతోంది. 2025 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇదే హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల టిమ్ డేవిడ్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో కోలుకోవడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే గాయం రావడంతో అతని వరల్డ్ కప్ అవకాశాలపై ప్రశ్నార్థకం నెలకొంది.
Read Also: ఇంగ్లండ్ బౌలర్‌పై అశ్విన్ ప్రశంసలు
Follow Us On : WhatsApp


