కలం వెబ్ డెస్క్ : నటుడు శివాజీ(Shivaji) హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పడంతో పాటు మహిళా కమిషన్ ముందు విచారణకు సైతం హాజరయ్యారు. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రజా శాంతి అధినేత కేఏ పాల్(KA Paul) శివాజీ కామెంట్స్‌పై స్పందించారు. శివాజీ ఉద్దేశపూర్వకంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపించలేదన్నారు. కానీ, బాలకృష్ణ(Balakrishna) లాంటి పెద్ద హీరో, బీజేపీ(BJP)తో అలయన్స్ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) అయ్యి ఉండి తను అమ్మాయిలను ముద్దు పెట్టుకుంటే తన ఫ్యాన్స్‌కు ఇష్టం అని వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు. అప్పుడు ఈ మహిళా హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఆయనను విచారణకు ఆదేశించిందా అని నిలదీశారు. ఆయనకు ఈ ఏడాది పద్మభూషన్ ఇచ్చారని, వచ్చే సంవత్సరం భారతరత్న కూడా ఇస్తారని విమర్శించారు. బీజేపీతో అలయన్స్‌లో ఉన్నందుకే ఈ వివక్ష అని వ్యాఖ్యానించారు. యూపీలో బీజేపీ నేత అమ్మాయిని రేప్ చేసినా తనకు బెయిల్ ఇస్తున్నారని, బాధితురాలు తనకు ప్రాణహాని ఉందంటున్నా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ, మోడీ ప్రభుత్వం క్రెడిబెలిటీ కోల్పోతుందని చెప్పారు. శివాజీ బీజేపీ పాలనను విమర్శిస్తున్నందుకే ఈ శిక్ష వేశారా? అని ప్రశ్నించారు.


