కలం స్పోర్ట్స్: ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్‌పై (Josh Tongue) భారత మాజీ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. జోష్ మళ్లీ ఇంత జోష్‌తో వస్తాడని అనుకోలేదని అన్నాడు. మెల్‌బోర్న్‌వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే ఇందులో 15ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ సాధించిన విజయం కన్నా, ఇంగ్లీష్ పేసర్ జోష్ టంగ్ కంబ్యాక్ గురించే అంతా చర్చిస్తున్నారు. ఏళ్ల క్రితం స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో జోష్.. క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి కెరీర్ డౌలమాలో పడిందనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం మైదానంలో విజృంభస్తున్నాడు. వరుస వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌లో జోష్ అదరగొట్టాడు. తాజాగా ఈ మ్యాచ్‌లో జోష్ పర్ఫార్మెన్స్పై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2017లో వోర్సెస్టర్షైర్లో జోష్‌తో కలిసి ఆడిన రోజులను గుర్తుచేసుకున్నాడు. “అప్పుడు అతని పరిస్థితి చూస్తే ఇలా తిరిగి వస్తాడని అనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రతి స్పెల్‌లోనూ వికెట్లు తీసే బంతులు వేయడం అతని ప్రత్యేకత. బ్రైడన్ కార్స్ కూడా మంచి ఎన్ఫోర్సర్. లైన్స్, లెంగ్త్స్‌ను క్రమంగా నియంత్రిస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ మరింత బలపడుతుంది” అని అశ్విన్ (Ravichandran Ashwin) చెప్పాడు.
మెల్బోర్న్ టెస్టులో టంగ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండును పడగొట్టి మొత్తం ఏడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశాడు. దీంతో, డారెన్ గఫ్, డీన్ హెడ్లీల తర్వాత అక్కడ ఫైఫర్ తీసిన ఇంగ్లాండ్ బౌలర్‌గా జోష్ పేరు చరిత్రలో చేరింది.
Read Also: 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ తొలి విజయం
Follow Us On: Sharechat


