గుట్టుగా గుడుంబా దందా.. రంగంలోకి పోలీసులు

కలం, నిర్మల్ : గుడుంబా నిర్మూలనలో భాగంగా ఖానాపూర్ (Khanapur) మండలంలోని పలు గ్రామాల్లో ఎక్సైజ్, పోలీసులు శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కొమ్ము తండా, రంగంపేట తండా, సత్తన్‌ పల్లి, గోసన్‌ పల్లి, యెర్వ చింతల్, బెర్నండి, కోలంగుట్ట, సోమవార్ పేట, పాత ఎల్లాపూర్ గ్రామాల్లో దాడులు చేపట్టారు. ఆరు కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు.

13 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఖానాపూర్ మండలాన్ని గుడుంబా రహిత మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దాడులు నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, ఎస్సైలు వసంతరావు, సింధు, ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : నేరెళ్ల శారదకు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>