వనపర్తి అభివృద్ధికి మేఘారెడ్డి ప్రతిపాదనలు.. మంత్రి పొన్నం హామీ!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Thudi Megha Reddy) ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి పలు కీలక అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు. ప్రధానంగా శాస్త్రీయ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ నూతన భవనం, నాలుగు బీసీ సంక్షేమ విద్యాసంస్థలకు నూతన భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతిపాదించిన భవనాలు ఇవే..

  • శాస్త్రీయ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌తో కూడిన జిల్లా రవాణా కార్యాలయ నూతన భవనం
  • చిట్యాల (వనపర్తి)లో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (బాలుర) నూతన భవనం
  • కడుకుంట్లలో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల (బాలుర) నూతన భవనం
  • పెబ్బేరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల (బాలికల) నూతన భవనం
  • వెల్టూరులో ఎంజేపీ తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల (బాలికల) నూతన భవనం

వనపర్తి జిల్లాలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడంతోపాటు బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు నూతన భవనాల నిర్మాణం అవసరమని ఎమ్మెల్యే మేఘారెడ్డి (Megha Reddy) మంత్రికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న వసతులు, భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని భవనాలను మంజూరు చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలను పరిశీలించి, ఆయా శాఖల పరిధిలో అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే మంజూరీలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై సానుకూలంగా స్పందించిన మంత్రికి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read :  ‘టిమ్స్’ సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>