పంజాబ్‌లో ఆల్ టైం గరిష్టానికి వరి సాగు

కలం, వెబ్ డెస్క్: దేశంలోని ప్రధాన వ్యవసాయ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న పంజాబ్ రాష్ట్రం వరి సాగులో (Punjab Paddy Farming) దూసుకుపోతుంది. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 32.76 లక్షల హెక్టార్ల భూమిలో రైతులు వరి పంట వేసినట్లు అక్కడి వ్యవసాయాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఖరీఫ్‌ సాగు భూమిలో సుమారు 90 శాతం వరి పంటను రైతులు పండిస్తున్నారు.

ఇదిలా ఉంటే వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పంజాబ్ (Punjab) ప్రభుత్వం సూచిస్తోంది. భూసారం దెబ్బతినకుండా ఉండేందుకు, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని రాష్ట్ర రైతాంగానికి విన్నవించింది. వరి పంటకు ఎక్కువ నీరు అవసరమౌతున్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేసింది.

ప్రభుత్వం ఆరుతడి పంటలు పండించాలి సూచిస్తున్నా.. అక్కడి రైతన్నలు వరి పంటకే మొగ్గు చూపుతున్నారు. వరి సాగు రైతులకు మార్కెట్‌ భద్రత, ప్రభుత్వ కొనుగోలు, కనీస మద్దతు ధర వంటి అంశాల కారణంగా ఆకర్షణీయంగా ఉండటంతో రైతులు వరికే ఆసక్తి కనబడుతున్నారు. వరి సాగు అధికంగా ఉండటం వల్ల రాష్ట్ర భూగర్భ జలాలపై ఒత్తిడి, నీటి వినియోగం, నేల ఆరోగ్యం, పంటల వైవిధ్యం తగ్గడం వంటి దీర్ఘకాలిక సమస్యలు మరింత తీవ్రం అవుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే సాగునీరు ఇచ్చేందుకు విద్యుత్ ఖర్చు కూడా భారీగా అయ్యే అవకాశం ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ, వరి సాగు నుంచి రైతులు పూర్తిగా బయటకు రావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి సారించింది.

Also Read : యూపీఐ ఛార్జీలపై ఫోన్ పే కీలక ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>