కలం, నిజామాబాద్ బ్యూరో: ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) సగం నిండింది. 40 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శనివారం ఉదయం 6 గంటల వరకూ 1078.20 అడుగులకు చేరుకుంది. 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ వరద వస్తోంది. లక్షా 39 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. 993 క్యూసెక్కుల నీటిని తాగు, సాగు నీటి అవసరాల కోసం పంపుహౌజ్ లు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు.

