కలం, వెబ్ డెస్క్ : కొరటాల శివ (Koratala Siva).. దేవర సినిమా తీశాడు.. దేవర 2 తెరకెక్కించాలి అనుకున్నాడు. ఇంత వరకు దేవర 2 ఉందో లేదో క్లారిటీ లేదు. ఒకసారి ఉందంటారు.. మరోసారి లేదంటారు. దీంతో దేవర 2 ఉందో లేదో అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ఆ మధ్య నాగ చైతన్యతో కొరటాల శివ సినిమా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ కాంబోలో మూవీ సెట్ కాలేదని తెలిసింది. దేవర 2 ఉందని.. అందుకనే.. చైతూతో ప్రాజెక్ట్ లేదని.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది.
ఇప్పుడు పవన్ (Pawan Kalyan), కొరటాల మూవీ గురించి సరికొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఈ క్రేజీ కాంబోలో అయినా మూవీ ఉందా? లేదా..? అసలు తెర వెనక ఏం జరుగుతోంది..?కొరటాల సినిమా చేయడం కోసం.. స్టార్ హీరోల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ.. ఏది సెట్ అవ్వడం లేదు. అయితే.. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కొరటాల శివ కలిశాడట.
అంతే కాదండోయ్.. కథ చెప్పడం కూడా జరిగిందని.. కాకపోతే పవన్ కొరటాల చెప్పిన ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. కొరటాల చెప్పిన కథ పవన్ కు నచ్చలేదా..? లేకపోతే పవన్ ఒప్పుకున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన తర్వాత సినిమా చేయాలంటే.. చాలా టైమ్ పడుతుంది కాబట్టి అంత వరకు వెయిట్ చేయమనడం ఇష్టం లేక నో చెప్పారా అనేది తెలియాల్సి వుంది.
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. మీడియం రేంజ్ హీరోలు కూడా దొరకడం లేదు. అందుచేత కొరటాల (Koratala Siva) హీరోల కోసం సెర్చింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన కథలు అన్నీ స్టార్ హీరోలకు సూట్ అవుతాయి. స్టార్ హీరో సెట్ అవ్వాలంటే వెయిట్ చేయాలి. లేదంటే.. తమిళ, మలయాళ స్టార్స్ తో తీయాలి. మరి.. మన స్టార్స్ కోసం వెయిట్ చేస్తారో.. తమిళ, మలయాళ స్టార్స్ తో సినిమా స్టార్ట్ చేస్తారో చూడాలి.
Read Also: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. ఏ 11 అల్లు అర్జున్
Follow Us On: X(Twitter)


