కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని మహా పోచమ్మ అమ్మవారిని బోథ్ ఎమ్మెల్యే (Boath MLA) అనిల్ జాదవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జేఈఈ మెయిన్ పరీక్షలో ఆలిండియాలో 461వ ర్యాంక్ సాధించిన తలమడుగు మండలం చర్లపల్లికి చెందిన పబ్బు ప్రతమ్‌ని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు ఫాక్స్ చైర్మన్ ఎల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అశోక్, కార్తీక్ రెడ్డి, గంగారెడ్డి ఉన్నారు.
Also Read : బస్సు తుస్సు.. మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు, ప్రయాణికులకు చుక్కలే!
Follow Us On: Sharechat

