పోచమ్మా చల్లంగా చూడమ్మా.. అమ్మవారికి బోథ్ ఎమ్మెల్యే పూజలు

కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని మహా పోచమ్మ అమ్మవారిని బోథ్ ఎమ్మెల్యే (Boath MLA) అనిల్ జాదవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జేఈఈ మెయిన్ పరీక్షలో ఆలిండియాలో 461వ ర్యాంక్ సాధించిన తలమడుగు మండలం చర్లపల్లికి చెందిన పబ్బు ప్రతమ్‌ని సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు ఫాక్స్ చైర్మన్ ఎల్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అశోక్, కార్తీక్ రెడ్డి, గంగారెడ్డి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>