విరాట్ కోహ్లీ అండే నా గోల్డ్‌కు బలం.. సాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గోల్డ్‌తో దేశాన్ని గర్వపడేలా చేసిన సాక్షి చౌదరి (Sakshi Chaudhary).. ఇప్పుడు తన విజయ రహస్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరును బయటపెట్టింది. కెరీర్‌లో ఆయన ఇచ్చిన అండ తనకు ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ మహిళల 51 కేజీల బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణ పతకం గెలిచింది.

ఈ విజయానంతరం మాట్లాడుతూ.. తన బాక్సింగ్ ప్రయాణానికి విజేందర్ సింగ్ స్ఫూర్తి అని చెప్పింది. అలాగే విరాట్ కోహ్లీ ఫౌండేషన్ నుంచి కీలక సమయంలో మద్దతు లభించిందని వెల్లడించింది. కోహ్లీ తనకు స్పాన్సర్‌గా ఉండటంతో పాటు మానసికంగా కూడా ప్రోత్సహించారని తెలిపింది. ఒత్తిడిని దూరంగా పెట్టి రింగ్‌లో ప్రదర్శనపైనే దృష్టి పెట్టాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారని వివరించింది.

గాయం కారణంగా 2022 కామన్వెల్త్ గేమ్స్, 2023 ఆసియా క్రీడలను ఆమె (Sakshi Chaudhary) కోల్పోయింది. తర్వాత 54 కేజీల నుంచి 51 కేజీల విభాగానికి మారింది. ఆ నిర్ణయం సరైన ఫలితం ఇచ్చింది. ఫైనల్లో ఇంగ్లండ్ బాక్సర్ రూబీ వైట్‌ను 5-0 తో చిత్తు చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ బాక్సింగ్‌లో మొత్తం 10 పతకాలు గెలిచింది. అందులో ఏడు స్వర్ణాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో బాక్సింగ్‌లో అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశంగా భారత్ నిలిచింది.

Also Read : 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలా?.. ప్రియాంక్ పంచాల్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>