కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని 9వ వార్డు, ఓల్డ్ డీఎస్పీ ఆఫీస్ రోడ్డు–సరస్వతి కాలనీ–మర్రికుంట ప్రాంతంలో బహిరంగంగా ఉన్న ప్రమాదకర బోరుపై ‘కలం డైలీ’లో వచ్చిన కథనంపై వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరును పూర్తిగా క్లోజ్ చేసి ప్రమాదాన్ని తొలగించారు.
చిన్నారులు ఆ బోరు వద్ద ఆడుకుంటుండటంతో ఎప్పటికప్పుడు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కలం డైలీలో వచ్చిన కథనంలో ప్రమాదకర బోరుతో చిన్నారులకు ముప్పుపై సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో, కొద్ది గంటల్లోనే సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్‌తో పాటు స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : 15 ఏళ్ల వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలా?.. ప్రియాంక్ పంచాల్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

