భీమలింగం కాలువకు కొత్త కళ.. శుభ్రత పనులు షురూ

కలం, వలిగొండ: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) తన సొంత నిధులతో భీమలింగం కాలువలో (Bhimalingam Canal) పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకుల తొలగింపు కార్యక్రమాన్ని శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో ప్రారంభించారు. కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ మాట్లాడుతూ.. భీమలింగం కాలువలో గుర్రపు డెక్క ఆకు అధికంగా పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతోందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరగా, స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతో కాలువలో గుర్రపు డెక్క ఆకుల తొలగింపు పనులు చేపట్టాలని తెలిపినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కాలువ శుభ్రత పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>