బెంగళూరులో 11వ జాతీయ బీసీ మహాసభ.. పాల్గొన్న నిర్మల్ జిల్లా నాయకులు

కలం, నిర్మల్: కర్ణాటక రాష్ట్రం బెంగళూరు (Bengaluru) లోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 11వ జాతీయ బీసీ మహాసభ (National BC Conference) నిర్వహించారు. ఈ సభలో నిర్మల్ (Nirmal) జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్, సోన్ మండల అధ్యక్షుడు మ్యాక ప్రేమ్‌ కుమార్‌ తో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు.

జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరై ప్రసంగించారు. బీసీల సంక్షేమానికి ప్రత్యేక శాఖ, తగిన నిధుల కేటాయింపు, బీసీ కులగణన, ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టి, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>