మెగా డీఎస్సీపై వైసీపీ భారీ కుట్ర: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీపై వైసీపీ భారీ కుట్ర చేస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విమర్శలు గుప్పించారు. చీరాలలో జరిగిన ‘నేతన్న సేవ’ పథకంలో మాట్లాడారు. ఎన్నికల్లో హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే మెగా డీఎస్సీ నిర్వహించామని గుర్తు చేశారు. టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొడ్డలి పార్టీ 300కి పైగా కేసులు వేసిందన్నారు. వాటిని అధిగమించి, ఏడాదిలోనే అత్యంత పారదర్శకంగా, ఎక్కడ పొరపాట్లకు తావు లేకుండా ఉద్యోగాలిచ్చామన్నారు. ప్రస్తుతం టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారని.. ఇప్పుడు పేపర్ లీక్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిందన్నారు. ప్రసంగంలో ఎక్కడా సీఎం చంద్రబాబు వైసీపీ పేరు ఎత్తకుండా గొడ్డలి పార్టీ అంటూ సంబోధించారు.

మహిళా ఎస్సైతో అసభ్యకర ప్రవర్తన..

నేరాలు, ఘోరాలు చేసేవారిని గొడ్డలి పార్టీ ప్రోత్సహిస్తోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి కుమారుడు యాక్సిడెంట్ చేస్తే.. కనీసం గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వదిలేశారన్నారు. చివరికి వ్యక్తి చనిపోతే.. మరొకరిపై కేసు పెట్టి, తప్పించుకోవాలని చూశారన్నారు. ప్రమాదంలో వ్యక్తి చనిపోయినా.. అదేం పెద్ద సమస్య కాదంటూ మాట్లాడటం జగన్ ఆలోచనాతీరుకు నిదర్శనమన్నారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైని చుట్టుముట్టి, వైసీపీ పార్టీ నేతలు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ దుయ్యబట్టారు.

రాష్ట్రానికి రాజధాని అవసరం..

ప్రతి కుటుంబానికి ఇల్లు ఉన్నట్లే.. రాష్ట్రానికి కూడా రాజధాని అవసరమని సీఎం చంద్రబాబు వివరించారు. మేటి నగరాలతో పోటీ పడేలా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో రాజీ లేకుండా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. నేతన్న సేవ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 చొప్పున 71,536 కుటుంబాలకు రూ. 179 కోట్లు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బీసీలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Also Read : భారతీయ సంస్కృతిలో చేనేత కళ కీలక భాగం: సీఎం చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>