ఈ రోజే తేలాలి.. డివోర్స్‌పై ప‌ట్టుబ‌ట్టిన విజ‌య్ భార్య‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ (CM Vijay) విడాకుల పిటిష‌న్‌ నేడు చెంగ‌ల్ప‌ట్టులోని ఫ్యామిలీ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. విజ‌య్ భార్య సంగీత‌ (Sangeetha) వ‌ర్చువ‌ల్‌గా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. విజ‌య్ త‌ర‌ఫున లాయ‌ర్ హాజ‌రై వాద‌న‌లు వినిపించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పిటిష‌న్‌ విచార‌ణ‌ను మ‌రో తేదీకి వాయిదా వేయాల‌ని విజ‌య్ త‌ర‌ఫు లాయ‌ర్ కోరారు. అయితే సంగీత ఇందుకు అంగీక‌రించ‌లేదు. ఈ రోజే ఏదో ఒక‌టి తేల్చాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఇరువురి వాద‌న‌లు విన్న కోర్టు విచార‌ణ‌ను కొద్దిసేపు వాయిదా వేసింది. ఈ నేప‌థ్యంలో సాయంత్రం వ‌ర‌కు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంద‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

కొన్నేళ్లుగా నెల‌కొన్న మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విజ‌య్‌ (CM Vijay), సంగీత దంప‌తులు 2025 డిసెంబ‌ర్‌లో విడాకుల కోసం చెంగ‌ల్ప‌ట్టులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు. సంగీత దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో విజ‌య్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. విజ‌య్ త‌న‌ను కొన్నేళ్లుగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇంట్లో కూడా ఉండ‌నివ్వ‌డం లేద‌ని కోర్టుకు తెలిపారు. విజ‌య్‌ ఒక హీరోయిన్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడ‌న్న వార్త‌లు కూడా త‌మిళ‌నాడులో హాట్ టాపిక్‌గా మారాయి. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ముందు జ‌రిగిన ఈ ప‌రిణామం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Also Read : హ‌స్తం పార్టీలో సోష‌ల్ మీడియా ప‌ద‌వులు.. బీఆర్ఎస్ సెటైర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>