కలం, వెబ్‌డెస్క్: నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో భారీ చేనేత ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ప్రభుత్వం, చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మొహమ్మద్ అజారుద్దీన్, కొండా సురేఖ, సీతక్క తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన చేనేత కళాకారుల అద్భుతమైన ఉత్పత్తులు, రకరకాల వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. సందర్శకులు తమకు నచ్చిన వాటిని కొనుక్కోవడానికి అవకాశం ఉంది.

