కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం అనేది పెను ముప్పుగా మారిందన్నారు సీపీ సజ్జనార్ (VC Sajjanar). ‘సిటీలో ఏది మంచి ఫుడ్, ఏది నకిలీ ఫుడ్ అనేది తెలుసుకోలేకుండా ఉన్నాం. కల్తీ ఫుడ్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. కల్తీ అనేది కనిపించకుండా చేయాలన్నదే మా టార్గెట్. దానికోసం త్వరలోనే ఆహార కల్తీ నివారణ టీమ్స్ ను ఏర్పాటు చేస్తాం. ఈ టీమ్ సిటీలో ఫుడ్ కల్తీ మీదనే స్పెషల్ గా ఫోకస్ పెడుతుంది. త్వరలోనే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాం. కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. న్యూ ఇయర్ వేడుకల్లో కల్తీపై మరింత కఠినంగా ఉంటాం’ అంటూ తెలిపారు సజ్జనార్.
Read Also: నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు : ప్రకాష్ రాజ్
Follow Us On: Instagram


