నాని మాస్ షో.. ‘ది ప్యారడైజ్’ టీజర్ అవుట్!

కలం, సినిమా : న్యాచురల్ స్టార్ నాని (Nani), టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మాస్, యాక్షన్ మూవీ ” ది ప్యారడైజ్”(The Paradise). ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, సోనాలీ కులకర్ణి వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్యారడైజ్ టీజర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది.

దసరా వంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై  ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌లో నాని పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని మాస్ ర్యాంపేజ్ అదిరిరిపోయిందంటూ టీజర్‌కు అభిమానుల నుంచి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ” ది ప్యారడైజ్” సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్షీషు భాషలలొ 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>