కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డు వరకు రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తాత్కాలిక నిర్మాణాలు, వ్యాపార విస్తరణలు, పాదచారుల మార్గాలను ఆక్రమించేలా చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. దీంతో రహదారి పూర్తిగా అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, వాహనదారులు, పాదచారులు సులభంగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రహదారి భద్రత, ప్రజల సౌకర్యం కోసం ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు తెలిపారు.

