నల్లగొండ ఆసుపత్రిలో చార్జింగ్ కష్టాలు

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు (Attenders) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మొబైల్ చార్జింగ్ పాయింట్లను (Mobile Charging Points) అటెండర్లు వినియోగించుకోకుండా మూసివేయడం వివాదాస్పదంగా మారింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మొబైల్ చార్జింగ్ సౌకర్యాలపై వైద్య సిబ్బంది స్టిక్కర్లు  వేసి వాటిని నిలిపివేయడంతో రోగుల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్జింగ్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయని, అత్యవసర పరిస్థితులలో కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకులకు మొబైల్ ఫోన్ ఎంతో అవసరమని, మందులు, రక్తం, ఇతర వైద్య అవసరాల కోసం బయట ఉన్న వారిని సంప్రదించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని బాధితులు పేర్కొంటున్నారు.

ఆసుపత్రి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై పలువురు అటెండర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల సహాయకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ (Nalgonda Collector), జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఆసుపత్రిలో అటెండర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ చార్జింగ్ సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని లేదా ప్రత్యామ్నాయ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>