పూజా దుకాణంలో అర్ధరాత్రి చోరీ.. వెండి సామాగ్రి మాయం

కలం, నిర్మల్: నిర్మల్ ( Nirmal) జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ ప్రాంతంలో వేంకటేశ్వర పూజా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం యజమాని దుకాణం ఓపెన్ చేసేందుకు వెళ్లగా, తాళాలు ధ్వంసమై ఉండటాన్ని గమనించాడు. వెంటనే లోపలికి వెళ్లి పరిశీలించగా కౌంటర్‌లో ఉంచిన రెండు వేల నగదుతోపాటు మొదటి అంతస్తులో భద్రపరిచిన సుమారు రూ.60 వేల విలువైన వెండి పూజా సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : యూపీఐ చెల్లింపులపై ఛార్జీల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>