డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి : గంగాడి కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ : హుజురాబాద్ (Huzurabad) మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్, కౌన్సిలర్‌ల మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పాలన అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.

నిజమైన నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హులైన పేదల హక్కులను కాలరాస్తూ, కేవలం అనర్హులకు, అధికార కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేశారని ఆరోపించారు. పేద ప్రజలకు చెందాల్సిన ఇళ్లను అన్యాక్రాంతం చేస్తున్న అధికారుల తీరుపై బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.

త్వరలోనే బాధితులకు మద్దతుగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇండ్లు వచ్చే వరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పి చైర్ పర్సన్ కనుమల విజయ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు, హుజురాబాద్ బీజేపీ కౌన్సిలర్లు కొలుగురి సుమలత, దామెర అనూష, అనురాగ్, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>