నారాయణఖేడ్ రైతులకు గుడ్‌న్యూస్.. నల్లవాగు కాలువలకు నీటి విడుదల

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (Narayankhed) నియోజకవర్గం నల్లవాగు ప్రాజెక్ట్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. ప్రాజెక్ట్ అలుగు ద్వారా నీరు వృథాగా పోకుండా, నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎడమ, కుడి కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీటిని అధికారికంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ రెడ్డి (MLA Sanjeeva Reddy) మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. న‌ల్లవాగు ప్రాజెక్ట్‌లో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున, రైతులకు సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నారాయణఖేడ్ (Narayankhed) నియోజకవర్గంలోని రైతాంగానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాలువల ద్వారా సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Also Read : గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. ఆ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>