ఈ నెల 9న నల్లబెల్లికి కేసీఆర్

కలం, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి(Nallabelli)కి ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) వెళ్లనున్నారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 9,10 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ.. పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన కేటీఆర్, 10వ తేదీన హరీశ్ రావు హాజరు కానున్నారు.

కాగా, జులై 30 గురువారం అర్ధరాత్రి పెద్ది సుదర్శన్‌ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణించారు. అయన తుది శ్వాస విడిచినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పెద్ది మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పలువురు రాజకీయ నేతలు ఆయన భౌతిక కాయానికి ఆస్పత్రిలో నివాళి అర్పించారు. స్వగ్రామం నల్లబెల్లిలో జులై 31న పెద్ది సుదర్శన్‌ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. మంత్రి సీతక్క, బీఆర్​ఎస్ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులు అర్పించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

Also Read : ప్ర‌తిప‌క్షంలోనే ప్ర‌శాంతంగా ఉందంటున్న కేటీఆర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>